
పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేస్తున్న కలెక్టర్
హన్మకొండ అర్బన్: ఓటరు నమోదులో భాగంగా స్వీప్ కార్యక్రమాల ద్వారా జిల్లావ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఓటు హక్కు నమోదులో భాగంగా జిల్లాస్థాయిలో నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఆమె బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ 19వ తేదీ ఓటరు నమోదుకు చివరి గడువు అని, జిల్లా వ్యాప్తంగా పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ విస్తృతంగా ప్రచారం చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ముగిసిన ఓటరు నమోదు : కలెక్టర్ ప్రావీణ్య
జిల్లాలో ఓటరు నమోదు కార్యక్రమం మంగళవారం ముగిసిందని కలెక్టర్ ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరు జాబితా సంబంధిత పోలింగ్ కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయంలో ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. ఓటరు నమోదు కార్యక్రమం ముగిసినా అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు కూడా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్