ఎక్సైజ్‌, రిజిస్ట్రేషన్‌ గలగల.. బల్దియా వలవల

వరంగల్‌ అర్బన్‌/కాజీపేట అర్బన్‌: ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులుగా రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ, ఎకై ్సజ్‌శాఖలు నిలుస్తున్నాయి. 2023 వార్షిక సంవత్సరానికి ఈ రెండు శాఖలు కాసుల వర్షాన్ని కురిపించి ఖజానా నింపాయి. ఇక.. వరంగల్‌ మహా నగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) అదాయ సేకరణ అంచనాలు తప్పాయి. 2022–23 ఆస్తిపన్ను, నీటిచార్జీలను వసూలు చేయాలని ఽధృడ సంకల్ఫంతో రంగంలోకి దిగిన గ్రేటర్‌ అధికార యంత్రాంగానికి జీడబ్ల్యూఎంసీ వైబ్‌సైట్‌ నుంచి ఈ–మునిసిపాలిటీ వెబ్‌సైట్‌కు వివరాల మార్పుతో తీవ్ర ప్రభావం చూపించింది. చివరి రోజు శుక్రవారం ఆస్తి, నీటిపన్నులు రూ..2.20కోట్ల పై చిలుకు సొమ్ము వసూలైనట్లు అధికారులు వెల్లడించారు. ఆస్తిపన్ను 75శాతం వసూలైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది బిల్‌కలెక్టర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, అధికారులు శ్రమించినా వసూళ్లలో ఫలితాలు కనిపించలేదు. ఈ–సేవా కేంద్రాలు, క్రెడిట్‌, డెబిట్‌, నెట్‌ బ్యాంకింగ్‌, టీ–వ్యాలెట్‌, ఈ–చలాన్‌ ద్వారా చెల్లింపులు జరిగాయి.

గడువు పొడిగింపుపై ఎదురుచూపులు

రాష్ట్ర ప్రభుత్వం ఆస్తిపన్ను, నీటిచార్జీల వసూళ్ల కోసం గడువు పొడిగిస్తుందని బల్దియా అధికారులు ఎంతగానో అశగా ఎదురుచూస్తున్నారు. ఆస్తిపన్ను స్థానిక సంస్థలకు ప్రధాన ఆదాయ వనరు. గత ఏడాది కూడా పన్నుల వసూళ్లు పూర్తిగా మందగించాయి. ఈసారీ నిరాశే మిగిలింది.

రిజిస్ట్రేషన్‌, ఎకై ్సజ్‌ శాఖ..

ఉమ్మడి జిల్లాలో భీమదేవరపల్లి, స్టేషన్‌ ఘన్‌పూర్‌, జనగామ, కొడకండ్ల, మహబూబాబాద్‌, ములు గు, పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, వరంగల్‌ రూరల్‌, వరంగల్‌ ఆర్వో, వరంగల్‌ ఫోర్ట్‌ 12 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల ద్వారా భూ రిజిస్ట్రేషన్లను నిర్వహిస్తారు. 2022 మార్చి నాటి 89,511 దస్తావేజులకు గాను రూ.311 కోట్ల ఆదాయాన్ని ఖజానాకు అందజేశాాయి. తన రికార్డు తానే బ్రేక్‌ చేస్తూ మార్చి 2023 నాటికి 1,02,923 దస్తావేజులకుగాను రూ.401 కోట్ల ఆదాయాన్ని అందించింది.

2023 వార్షిక సంవత్సరానికి

కాసులు కురిపించిన మద్యం,

రిజిస్ట్రేషన్లు

అంచనా తప్పిన జీడబ్ల్యూఎంసీ ఆదాయం

చివరి రోజు రూ.2.20కోట్లు వసూలు

Read latest Hanamkonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top