
హన్మకొండ కల్చరల్ : నగరంలోని వివిధ ఆలయాల్లో గురువారం జరగనున్న శ్రీసీతారామచంద్రస్వామిల కల్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పలు దేవాలయాల్లో కల్యాణం నిర్వహించడానికి షామీయానాలు, పందిళ్లు వేసి మామిడి తోరణాలు, విద్యుత్‌దీపాలతో ముస్తాబు చేశారు. వేయిస్తంభాల గుడిలో ఉదయం 10గంటల నుంచి కల్యాణతంతు ప్రారంభమవుతుందని ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ, ఈఓ వెంకటయ్య తెలిపారు. వరంగల్ ఎల్లంబజార్‌లోని శ్రీసీతారామచంద్రస్వామి వారి అలయం, శివనగర్‌లోని సీతా రామచంద్రస్వామి ఆలయం, ఓ సిటీలోని శ్రీసీతా రామాంజనేయ లక్ష్మీగణపతి అయ్యప్పస్వామి దేవా లయం, హనుమకొండలోని చిన్నకొవెల, రెవెన్యూ కాలనీ, ఎకై ్సజ్ కాలనీ, తదితర కాలనీల్లోని ఆలయాల్లో కల్యాణోత్సవాలు జరగనున్నాయి.