
విద్యారణ్యపురి/కాళోజీ సెంటర్ : ఇంటర్ సెకండియర్ పరీక్షలు బుధవారం ముగిశాయి. హనుమకొండ జిల్లాలో చివరిరోజు పరీక్షలకు జనరల్, ఒకేషనల్ కోర్సులు కలిపి 15,238మందికి 14,801మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరుకాగా 437మంది గైర్హాజరయ్యారని డీఐఈఓ గోపాల్ తెలిపారు. వరంగల్ జిల్లాలో 6,522 మంది విద్యార్థులకు 6,225మంది హాజరుకాగా, 297మంది గైర్హాజరయ్యారని డీఐఈఓ కాక మాధవరావు తెలిపారు. పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు. తల్లిదండ్రులు తమ పిల్లలను దగ్గరుండి ఇంటికి తీసుకెళ్లారు.