గుంటూరు ఎడ్యుకేషన్: ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ఫీజులపై సోమవారం ‘ప్రైవేటు బడి.. నిలువు దోపిడీ’ శీర్షికతో ‘సాక్షి’ లో ప్రచురితమైన కథనానికి జిల్లావిద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా స్పందించారు. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు విద్యాహక్కు చట్ట ప్రకారం విడుదల చేసిన జీఓ నెం.53లో నిర్దేశించిన విధంగా ఫీజులు వసూలు చేయాలని యాజమాన్యాలను ఆదేశించారు. అదేవిధంగా క్యాంపస్‌లో పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగులు వంటి సామగ్రి విక్రయించరాదని స్పష్టం చేశారు. అధిక ఫీజులు వసూలు, యూనిఫాం, పుస్తకాలు, బ్యాగులు విక్రయిస్తే యాజమాన్యంపై తగుచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


