న్యూస్‌రీల్
బూటకపు హామీలతో గద్దెనెక్కిన బాబు
అంబటి రాంబాబు మాట్లాడుతూ అమలు సాధ్యం కాని బూటకపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ఓట్లేసిన ప్రజలను నిలువునా మోసం చేశారని ఆరోపించారు. సూపర్‌సిక్స్ హామీల్లో ప్రధానమైన ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన మహిళలు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి రూ.1,500 చొప్పున ఇస్తామని మోసగించారని ఆరోపించారు. 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు నెలవారీ పెన్షన్ ఇస్తామని మోసం చేశారన్నారు. ఆయన సుపుత్రుడు నారా లోకేష్ యువగళం పేరుతో ప్రతి నిరుద్యోగికి రూ.మూడువేలు భృతి ఇస్తామని మోసగించారని, ఆయనకు ఎమ్మెల్యేగా ఉద్యోగం వచ్చి, మంత్రిగా ప్రమోషన్ వచ్చిందని ఆరోపించారు. ప్రస్తుతం సీఎంగా డబుల్ ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ప్రజలను మోసం చేసిన ప్రభుత్వమిదని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రపంచ మోసగాడు చంద్రబాబు, సీఎం కావాలనుకునే లోకేష్ ఆలిండియా మోసగాడని, వైఎస్సార్ సీపీ పాలనలో 30 వేల మంది మహిళలు ఉమెన్ ట్రాఫికింగ్ కింద రాష్ట్రం నుంచి తరలించబడ్డారని అబద్ధాలు చెప్పిన ఆంధ్రా మోసగాడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. సూపర్ సిక్స్ ఇచ్చేశామని చెబుతూ, ఇవ్వలేదని ఎవరైనా అంటే వారికి నాలుక మందమని చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోతారని అన్నారు. డీఎస్సీలో ఉద్యోగాల కోసం రూ.20 లక్షలు, రూ.30 లక్షలు డబ్బులు తీసుకున్న లోకేష్ జేబులు నింపుకొన్నారని ఆరోపించారు. తన శాఖలో జరిగిన అవినీతిపై మాట్లాడకుండా, తన బదులు అధికారులతో మాట్లాడిస్తున్నారని దుయ్యబట్టారు. రెండేళ్లకే కూటమి పనైపోయిందని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంటులో ప్రమాదం జరిగితే సీఎం, పరిశ్రమల శాఖ మంత్రి వెళ్లకుండా శాఖతో సంబంధం లేని లోకేష్ వెళతారని ఎద్దేవా చేశారు. తన ఇంటిపై విధ్వంసానికి పాల్పడిన నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గతంలో నిరాహార దీక్ష చేశానని చెప్పారు. జూలై 29న తన ఇంటి నుంచి మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం వరకు రెండు రోజులు వినతి పాదయాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. డీజీపీని కలిసి, దోషులను అరెస్టు చేయాలని వినతి పత్రం అందజేస్తానని చెప్పారు.
ప్రతిచోటా పోలీసుల అత్యుత్సాహం
సాగర్ నీటిమట్టం
పులిచింతల సమాచారం
నిమ్మకాయల ధరలు
శనివారం శ్రీ 13 శ్రీ జూన్ శ్రీ 2026
7
ర్యాలీలో పార్టీ గుంటూరు అధ్యక్షురాలు నూరి ఫాతిమా, పోతిన మహేష్, శ్యామల
ప్రత్తిపాడులో జరిగిన నిరసన ర్యాలీలో బలసాని, పార్టీ శ్రేణులు
పొన్నూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో అంబటి మురళీకృష్ణ, నాయకులు
రెండేళ్ల మోసాలపై
చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ నిరసన గళం ఉవ్వెత్తున ఎగసిపడింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తున్న తీరుపై ప్రజాగ్రహ జ్వాల రేగింది. పార్టీ సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలుపుతున్న జిల్లా అధ్యక్షుడు
అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం తదితరులు
విజయపురి సౌత్: నాగార్జున సాగర్ నీటిమట్టం శుక్రవారం 517.50 అడుగులకు చేరింది. కుడికాలువకు 3,031, ఎస్‌ఎల్‌బీసీకి 450 క్యూసెక్కులు వదులుతున్నారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,7952 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.
తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3000, గరిష్ట ధర రూ.4000, మోడల్ ధర రూ.3500 వరకు పలికింది.
మరోవైపు రాజధాని జిల్లాలో నిరసనలకు ప్రజలు రాలేదని చూపించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దింపింది. గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు, తాడికొండ, తెనాలి నియోజకవర్గాలలో ఎక్కడికక్కడ నిరసన ర్యాలీకి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారు. గతం వారంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిష్టిబొమ్మను తెలుగుదేశం నాయకులు దహనం చేస్తుంటే దగ్గరుండి కాపలా కాసిన పోలీసులే... ఈరోజు డీఎస్సీ దిష్టిబొమ్మను తగులబెట్టకుండా అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేశారు. ర్యాలీలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ప్రత్తిపాడులో ఎస్‌ఐ నరహరి ఓవరాక్షన్ చేసి తగలబడుతున్న దిష్టిబొమ్మను కార్యకర్తల మీదకు వేయడంతో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.


