సచివాలయం సెక్రటరీపై పోక్సో కేసు | - | Sakshi
Sakshi News home page

సచివాలయం సెక్రటరీపై పోక్సో కేసు

May 16 2026 3:01 AM | Updated on May 16 2026 3:01 AM

సచివాలయం సెక్రటరీపై పోక్సో కేసు

లక్ష్మీపురం: వార్డు సచివాలయ సెక్రటరీపై అరండల్‌పేట పోలీసులు పోక్సో కేసు శుక్రవారం నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. గుంటూరు నగరంలోని అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శివనాగరాజు కాలనీకి చెందిన బాలిక(17) ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. బాలిక ఈ నెల 14వ తేదీన ఉదయం 11 గంటలకు ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం 159వ సచివాలయానికి వెళ్లింది. సమయంలో సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న డిజిటల ప్రొసెసింగ్‌ సెక్రటరీ అయిన మధుకిరణ్‌, బాలికతో అసభ్యంగా అసభ్యకరంగా ప్రవర్తించాడు. శుక్రవారం అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు సచివాలయ సెక్రటరీ మధుకిరణ్‌పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లైంగిక దాడికి యత్నించిన

నిందితుడి అరెస్ట్‌

లక్ష్మీపురం: మహిళపై లైంగిక దాడికి యత్నించిన ఎలక్ట్రిషియన్‌ను శుక్ర వారం పట్టాభిపురం పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. గుంటూరు కృష్ణానగర్‌లో ఓ ఇంట్లో విద్యుత్‌ మరమ్మతులకు సంతోష్‌ను పిలిచారు. మరమ్మతుల చేసేందుకు ఎలక్ట్రిషియన్‌ సంతోష్‌ నాగసాయి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో మహిళ ఒక్కటే ఉంది. మరమ్మతులు పూర్తి కాగానే బెడ్‌ రూమ్‌లోకి వెళ్లాడు. చేయి పట్టుకుని లైంగికదాడికి యత్నించాడు. దీంతో ఆమె తప్పించుకుని బయటకు వచ్చి కేకలు పెట్టింది. సంతోష్‌ అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ విషయంపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ప్రత్యేక బృందంతో సంతోష్‌ను అదుపులో తీసుకుని స్టేషన్‌కు తరలించి శుక్రవారం అరెస్ట్‌ చేసి కోర్టు హాజరు పరచగా రిమాండ్‌ విధించారు.

Advertisement
 
Advertisement
Advertisement