న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.5844 టీఎంసీలు.
ప్రసంగిస్తున్న రెవ.బాబూరావు
ప్రార్థనకు హాజరైన క్రైస్తవులు
గుంటూరులోని నార్త్ ప్యారిస్ చర్చిలో ప్రత్యేక ప్రార్థన
గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఈస్టర్ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముఖ్యంగా నగర పరిధిలోని పలు చర్చిలలో ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనలు చేపట్టారు. ఏసుక్రీస్తు జీవితం సమస్త మానవాళికి ఆదర్శనీయమని మతగురువులు బోధించారు. ప్రేమ, శాంతి, కరుణకు ప్రతిరూపమైన ఆ కరుణామయుడు మరణాన్ని గెలిచి, సమస్త మానవాళిని రక్షించడానికి తిరిగి వచ్చిన శుభదినం ప్రతి ఒక్కరిలో సంతోషాన్ని నింపుతుందని అన్నారు. క్రీస్తు మార్గం సర్వ మానవాళికి అనుసరణీయం అని వివరించారు. తోటి మానవులను ప్రేమగా చూడాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశ్వాసులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు
భక్తిశ్రద్ధలతో ఈస్టర్
7


