నగరంపాలెం: బాబు జగ్జీవన్‌రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ అన్నారు. జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మార్కెట్ కూడలిలోని శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించారు. తొలుత మార్కెట్ కూడలిలోని ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గళ్లా మాధవి, జేసీ అశుతోష్ శ్రీవాస్తవ, జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్‌లు నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్యాయాన్ని ప్రశ్నించాలి అనే ఆలోచన చిన్న వయస్సులోనే కలిగిన వ్యక్తి జగ్జీవన్‌రామ్ అని పేర్కొన్నారు. జగ్జీవన్‌రామ్ దేశ నిర్మాత అని అన్నారు. దేశాభివృద్ధికి, ప్రగతికి ఆలోచన చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు విజయశేఖర్, కూచిపూడి సత్యం, ఏటుకూరి విజయ్, ఈమని చంద్రశేఖర్, మేడిద బాబురావు, బత్తుల వీరాస్వామి, ఎండ్రపాటి సాంబశివరావు, వేమూరు సుధీర్, లక్ష్మీ శైలజ, పావని, పి.దేవదాసు, మాతంగి హేమలత మాట్లాడారు. కార్యక్రమంలో హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్‌బాషా, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, రెవెన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు.చెన్నయ్య, జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.దుర్గాబాయి పాల్గొన్నారు.


