భక్తుల కొంగు బంగారం క్వారీ బాలకోటేశ్వరుడు
న్యూస్‌రీల్
సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ మట్టం శుక్రవారం 536.40 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 20,641 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
మహాశివరాత్రి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి
చేబ్రోలు: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వడ్లమూడి క్వారీలోని బాలకోటేశ్వరస్వామి దేవాలయం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకొంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కోటప్పకొండ తిరునాళ్ల తరువాత చెప్పుకోదగిన చేబ్రోలు వడ్లమూడి క్వారీ తిరునాళ్లకు ఓ ప్రత్యేకత ఉంది. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా క్వారీ బాలకోటేశ్వరస్వామి విరాజిల్లుతున్నారు.
● సుమారు వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఆలయం వద్ద 80 ఏళ్ల నుంచి తిరునాళ్ల జరుగుతుంది. మొట్టమొదటిసారిగా చేబ్రోలు మండలం గొడవర్రు గ్రామస్తులు ప్రభను తిరునాళ్లకు తీసుకువచ్చినట్లు పెద్దలు చెబుతుంటారు.
● మహాశివరాత్రి సందర్భంగా జరిగే తిరునాళ్లకు జిల్లా నలుమూలల నుంచి సుమారు లక్షమంది భక్తులు హాజరవుతారు. ఆలయ ధర్మకర్త చీమకుర్తి యలమందయ్య కోర్కైపె మరణానంతరం ఆయన మృతదేహాన్ని ఆలయానికి ఆగ్నేయ దిశలో తెనాలి రోడ్డు పక్కనే సమాధి చేశారు. కాలక్రమేణా భక్తుల రాక పెరగటంతో ఆలయం అభివృద్ధి చెందింది.
● సూర్యదేవర వెంకటప్పయ్య అనే భక్తుడు నిజాంపట్నం మండలం నక్షత్ర నగర్‌లో తనకు ఉన్న ఎకరం భూమిని ఆలయ నిర్వహణకు రాశారు.
● జిల్లాలో వడ్లమూడి క్వారీ తిరునాళ్లకు ఆదరణ, గుర్తింపు లభించటంతో అధికారులు ఈ ఆలయాన్ని దేవదాయశాఖలో విలీనం చేశారు.
భారీ విద్యుత్ ప్రభలు ప్రత్యేక ఆకర్షణ...
భక్తుల కొంగు బంగారం క్వారీ బాలకోటేశ్వరుడు


