జనాభాకు అనుగుణంగా శ్మశానాల విస్తరణ | - | Sakshi
Sakshi News home page

జనాభాకు అనుగుణంగా శ్మశానాల విస్తరణ

Dec 31 2025 7:26 AM | Updated on Dec 31 2025 7:26 AM

జనాభాకు అనుగుణంగా శ్మశానాల విస్తరణ

జనాభాకు అనుగుణంగా శ్మశానాల విస్తరణ

జనాభాకు అనుగుణంగా శ్మశానాల విస్తరణ

ఐఆర్‌ఎస్‌ అధికారి, జీఎస్టీ కమిషనరేట్‌ ఆంధ్రప్రదేశ్‌ కమిషనర్‌ ఆనంద్‌కుమార్‌

తెనాలి: పెరుగుతున్న జనా భాకు తగినట్టుగా శ్మశానాలు కూడా విస్తరించాల్సిన ఆవశ్యకత ఉందని తెనాలికి చెందిన ఐఆర్‌ఎస్‌ అధికారి, విశా ఖపట్నంలోని గుంటూరు జీఎస్టీ ఆడిట్‌ కమిషనరేట్‌, ఆంధ్రప్రదేశ్‌ కమిషనర్‌ పులిపాక ఆనంద్‌ కుమార్‌ అన్నా రు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్వచ్ఛభారత్‌ అభియాన్‌ పథకంలో భాగంగా రూ.11 లక్షల నిధులతో రూరల్‌ మండల గ్రామం మల్లెపాడులో మంగళవారం పాత, కొత్త సమాధి స్థలాల ప్రహరీ నిర్మాణాన్ని ఆరంభించారు. జీఎస్టీ ఆడిట్‌ సర్కిల్‌ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి ఆనంద్‌ కుమార్‌ శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. శ్మశానం చుట్టూ కొబ్బరి మొక్కలను నాటారు. తొలుత శ్మశానంలోని తన తల్లిదండ్రుల సమాధులకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం అక్కడే ఏర్పాటైన సభలో మాట్లాడారు. గతంలో గ్రామస్తులు తనను కలిసినప్పుడు గ్రామంలో అభివృద్ధి పనులను తన దృష్టికి తీసుకొచ్చినట్టు ఆనంద్‌కుమార్‌ గుర్తుచేశారు. స్వచ్ఛ భారత్‌ నిధులు రూ.10లక్షలతో స్మశాన వాటికకు ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్టు చెప్పా రు. సర్పంచ్‌ పినపాటి భారతీదేవి, గుంటూరు ఆడిట్‌ సర్కిల్‌కు చెందిన అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎన్‌వీ సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్లు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement