21,22 తేదీల్లో వివా వీవీఐటీయూ 2కే25–26
పెదకాకాని: వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో డిసెంబర్ 21, 22 తేదీల్లో జాతీయస్థాయి యువజనోత్సవం వివా వీవీ 2కే25–26 నిర్వహించనున్నట్లు వీవీఐటీ విశ్వవిద్యాలయం ప్రో–చాన్స్‌లర్ వాసిరెడ్డి మహదేవ్ తెలిపారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోత్సహిస్తూ వారిలో ఉన్న అపరిమిత సామర్థ్యాలు, అంతర్గతశక్తిని గ్రహించాలని తెలియపరిచే విధంగా యువర్ పొటెన్షియల్ ఈజ్ ఎండ్ లెస్ ద మ్యాజిక్ ఈజ్ ఇన్ యు అనే నినాదంతో యానిమి ఇన్ ద స్ట్రీట్ ఆఫ్ చైనా నేపథ్యంలో ఈ యువజనోత్సవాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. స్టూడెంట్ యాక్టివిటీ కౌన్సిల్ (శాక్) విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకల్లో విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకత, నైపుణ్యం, కళాత్మకతను వెలికితీసే విధంగా సాంకేతిక, క్రీడా, సాంస్కృతిక విభాగాలలో 93 అంశాలలో పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ యువజనోత్సవానికి సంబంధించిన ప్రచార పోస్టర్లను బుధవారం విద్యార్థులతో కలసి విశ్వవిద్యాలయం ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, ప్రో–చాన్స్‌లర్ వాసిరెడ్డి మహదేవ్, రిజిస్ట్రార్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి విడుదల చేశారు. శాక్ విద్యార్థి తనువుద్ధి నవ్య మాట్లాడుతూ, వీవీఐటీ నిర్వహించే యువజనోత్సవం వివా వీవీఐటీయూ కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. యువజనోత్సవంలో పాల్గొనే విద్యార్థులు వివావీవీఐటీ.కామ్ వెబ్‌సైట్ నందు వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. అకడమిక్ డీన్ డాక్టర్ కె.గిరిబాబు, అడ్మిషన్ డైరెక్టర్ డాక్టర్ సి.ఉదయ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.


