తెనాలి నుంచి పెద్దాపురానికి ధాన్యం రవాణా
తెనాలి: రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని తెనాలి నుంచి తొలిసారిగా రైల్వేర్యాక్‌తో 30 వ్యాగన్ల ధాన్యాన్ని బుధవారం సాయంత్రం పెద్దాపురంలోని పట్టాభి ఆగ్రో ఇండస్ట్రీస్‌కు తరలించారు. తెనాలి రైల్వేస్టేషన్‌కు లారీల్లో చేర్చిన ధాన్యాన్ని వ్యాగన్లలో లోడు చేశారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజరు కె.తులసి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. జిల్లాలో తొలిగా కొనుగోలు కేంద్రం ప్రారంభించిన నాటి నుంచి నెలరోజుల వ్యవధిలో 26,500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించినట్టు తెలియజేశారు. ఇందుకుగాను రూ.63 కోట్లను చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.53 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. తెనాలి నుంచి రైల్వే ర్యాక్‌లో ధాన్యం రవాణా ఇదే ప్రథమంగా చెప్పారు. ఆరు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రోడ్డు మార్గాన తరలివెళ్లినట్టు తెలిపారు. జిల్లాలో 20 మంది రైస్‌మిల్లర్లు సేకరించిన 20 వేల మెట్రిక్ టన్నుల బీపీటీ–5204 ధాన్యాన్ని మధ్యాహ్న భోజన పథకానికి ఉపయోగిస్తామని వివరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కె.సుధీర్‌బాబు, పెద్దాపురంలోని పట్టాభి ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రతినిధులు, తెనాలి, కొల్లిపర మండలాల వీఆర్వోలు, వీఏఏలు పాల్గొన్నారు.


