జాతీయస్థాయి ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌కు నిహాల్ ఎంపిక
గుంటూరు ఎడ్యుకేషన్: మణిపూర్‌లో జనవరి 4వ తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు జరగనున్న జాతీయస్థాయి ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌నకు శ్రీచైతన్య జూనియర్ కళాశాల సీనియర్ ఇంటర్ బైపీసీ విద్యార్థి దానియేలు నిహాల్ ఎంపికై నట్లు విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఈమని దుర్గాప్రసాద్ తెలిపారు. బుధవారం లక్ష్మీపురంలోని కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దుర్గాప్రసాద్ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడారంగంలో విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇటీవల పెదకాకాని మండలం వెనిగండ్ల జెడ్పీ హైస్కూల్లో జరిగిన అండర్–19 రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని సాధించిన తమ విద్యార్థి దానియేలు నిహాల్ జాతీయస్థాయికి అర్హత సాధించాడని తెలిపారు. ఈసందర్భంగా నిహాల్‌ను అభినందించారు. కార్యక్రమంలో మహతి క్యాంపస్ ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు.


