21న సెంట్రల్ బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
కొరిటెపాడు(గుంటూరు వెస్ట్): సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 115వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఈ నెల 21వ తేదీన జరుపుకుంటోందని ఆ బ్యాంక్ చీఫ్ మేనేజర్ రాకేష్ రంజన్ తెలిపారు. అందులో భాగంగా మంగళవారం ‘భూమిని రక్షించండి.. ఆరోగ్యంగా ఉండండి’ అంటూ వాకథాన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ రంజన్ మాట్లాడుతూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 115వ వ్యవస్థాపక దినోత్సవానికి దారితీసే కార్యకలాపాలలో భాగంగా, కడప ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో ‘ఆరోగ్యంగా ఉండండి, ఫిట్‌గా ఉండండి‘ అనే థీమ్‌తో ఫిట్‌నెస్ అవగాహన వాకథాన్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. శారీరక ఫిట్‌నెస్, ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహించడానికి కడప ప్రాంతీయ కార్యాలయం, నగరపాలెం ప్రాంతంలో ఒక వాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రాంతీయ అధిపతి ఇ. వెంకటేశ్వరరావు సమక్షంలో ఈ కార్యక్రమం జరిగిందని వివరించారు.


