ర్యాలీని జయప్రదం చేయండి
నేడు ఉదయం 10 గంటలకు గుంటూరు కేంద్రంగా బృందావన్ గార్డెన్స్ నుంచి జరిగే కోటి సంతకాల పత్రాలను కేంద్ర పార్టీ కార్యాలయానికి చేర్చేందుకు చేపట్టే ర్యాలీని జయప్రదం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. పేద వర్గాలకు వైద్య విద్యను దూరం చేసి, తమ జేబులు నింపుకొనేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. చంద్రబాబు నిర్ణయంపై నిరసనగా రాష్ట్రంలో కోటి సంతకాలకు పిలుపునిస్తే.. కోటిన్నర సంతకాలు అయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న వ్యతిరేకత దీనిబట్టి అర్థమవుతోంది. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కోటి సంతకాల కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. కచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ నేడు జరిగే ప్రదర్శనకు తరలిరావాలని కోరుతున్నాం.
– అంబటి రాంబాబు,
గుంటూరు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు


