మాదకద్రవ్యాల నియంత్రణ కీలకం
గుంటూరు వెస్ట్: జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు అవగాహన, ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యక్రమాలను సంబంధిత శాఖలు క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. మాదకద్రవ్యాల నియంత్రణపై మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగానికి ఆకర్షితులవుతున్న వారిని ప్రాథమిక దశలోనే గుర్తించాలన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ నవంబరు 1 – 28వ తేదీ వరకు 12 కేసులకుగాను 42 మందిని అరెస్టు చేశామన్నారు.
తగినంత ఇసుక సరఫరా కావాలి
జిల్లాలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇసుక సరఫరా జరిగేలా మైనింగ్ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
రెవెన్యూ సమస్యలపై దృష్టి పెట్టండి
రెవెన్యూ సమస్యల పట్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ తహసీల్దారు సోమవారం అందుకున్న అర్జీలపై శుక్రవారం నాటికి స్పష్టమైన సమాచారం కలిగి ఉండాలని చెప్పారు.
జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా


