రైతులకు కష్టాలు
పత్తి కొనుగోలు కేంద్రాలు రెండు నెలలు ఆలస్యం చేయడం, కపాస్ కిసాన్ యాప్ వల్ల ఏర్పడిన ఇబ్బందులు రైతులను కష్టాల్లోకి నెట్టాయి. రైతుకు మద్దతు ధర పేరుతో క్వింటా పత్తికి నాలుగు నుంచి ఐదు కేజీల వరకు కోత విఽధించారు. దీంతో రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి సీసీఐలో కొన్నేళ్లుగా సాగుతోంది. రైతులు తక్కువ ధరకే మధ్యవర్తులకు అమ్ముకోవాల్సి వస్తోంది. జిన్నింగ్ మిల్లులు ఆ పత్తిని సీసీఐకి నాణ్యమైన పత్తిగా చూపించి రూ.కోట్లు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై రైతు సంఘాలు చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. గతంలో సీసీఐలో పనిచేసిన ఉన్నతాధికారి ఒకరు 40 వేల బేళ్ల వరకు అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదు చేశారు. దీనిలో సీసీఐ ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు ఆరోపణలు ఉండటంతో సీబీఐ రంగంలోకి దిగే సూచనలు కనపడుతున్నాయి.


