ఆంధ్రప్రదేశ్ గణిత ఫోరం జిల్లా శాఖ నూతన కార్యవర్గం
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ గణిత ఫోరం (ఏపీఎంఎఫ్) జిల్లా శాఖ అధ్యక్షుడిగా పెదకాకాని జెడ్పీ హైస్కూల్ గణితశాస్త్ర ఉపాధ్యాయుడు ఎస్వీ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా గుంటూరు స్తంభాలగరువులోని చేబ్రోలు మహాలక్ష్మీ–పుల్లయ్య నగరపాలకసంస్థ ఉన్నత పాఠశాల గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు బి.ప్రసాద్ ఎన్నికయ్యారు. ఆదివారం పాత బస్టాండ్ సెంటర్లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏపీఎంఎఫ్ గుంటూరు జిల్లా శాఖకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా ఎన్.బాల గంగాధర తిలక్ (గుంటూరు), గౌరవ సలహాదారుడిగా టి.సాంబశివరావు (తుళ్లూరు), కోశాధికారిగా అబ్దుల్ రెహ్మాన్ (నిడమర్రు), ఉపాధ్యక్షులుగా కె.కామాక్షి (దుగ్గిరాల), ఎం.సాయన్న (చినలింగాయపాలెం), బసవ లింగప్రసాద్, ఎంఎన్‌ఏ సిద్దిఖ్, బి.శ్రీనివాసరావు (గుంటూరు), జిల్లా కార్యదర్శులుగా నాంచారయ్య (తాడేపల్లి), ఎం.బాలనాగయ్య నాయక్ (కొలకలూరు), షేక్ చాంద్‌బాషా (పొన్నూరు), యు.సాంబశివరావు(తుళ్లూరు), ఎన్.పద్మావతి (తుళ్లూరు), జె.మురళీమోహన్ (మంగళగిరి), సునీతారజని, కె.జయలక్ష్మి(గుంటూరు), ఎం. ఉషశ్రీ (పెదనందిపాడు), ఎ.బాలచంద్రారెడ్డి (మేడికొండూరు), పి. శ్రీనివాసరావు(అత్తోట), ప్రమీల (ఫిరంగిపురం) రాష్ట్ర కౌన్సిలర్లుగా ఉప్పాల రామమోహనరావు, టి.సాంబశివరావు(గుంటూరు) ఎన్నికయ్యారు. అన్ని మండలాల నుంచి కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర కార్యదర్శి టి.సాంబశివరావు వ్యవహరించారు. జిల్లా శాఖ ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థుల్లో గణిత సామర్‌ాధ్యన్ని వెలికితీయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.


