మంగళగిరిలో ఏపీ ఉర్దూ అకాడమీ కేంద్ర కార్యాలయం
మంగళగిరి టౌన్: మంగళగిరిలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారుక్ షిబ్లీ పేర్కొన్నారు. ఈ భవనాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ఉర్దూ అకాడమీ కేంద్ర కార్యాలయం విజయవాడ పరిధిలోని భవానీపురంలో ఉందని, త్వరలోనే మంగళగిరి ఆటోనగర్‌లో ఏపీఐఐసీ కార్యాలయ సమీపంలోని భవనంలోకి మార్చుతామని చెప్పారు. డిసెంబర్ 31కి ఏపీ రాష్ట్ర ఉర్దూ అకాడమీ స్థాపించి 5 దశాబ్దాలు పూర్తికానున్న నేపథ్యంలో మంగళగిరిలోని నూతన కేంద్ర కార్యాలయం నుంచి పరిపాలన ప్రారంభించనున్నట్లు తెలిపారు.


