జాతీయస్థాయి హాకీ పోటీలకు మేడికొండూరు విద్యార్థిని | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి హాకీ పోటీలకు మేడికొండూరు విద్యార్థిని

Nov 28 2025 8:39 AM | Updated on Nov 28 2025 8:39 AM

జాతీయ

జాతీయస్థాయి హాకీ పోటీలకు మేడికొండూరు విద్యార్థిని

19, 20వ తేదీల్లో కళ్లం ఇంజినీరింగ్‌ కళాశాలలో ‘సంకల్ప్‌’ 1 నుంచి ఏసీ బస్సు చార్జీల్లో రాయితీ బాలికను కిడ్నాప్‌ చేసిన యువకుడిపై కేసు

మేడికొండూరు: జాతీయస్థాయి హాకీ పోటీలకు మేడికొండూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థిని చిరతనగండ్ల అనూష ఎంపికై నట్లు పాఠశాల హెచ్‌ఎం కె.జయప్రద తెలిపారు. ఈనెల 22 నుంచి 24 వరకు చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరిగిన స్కూల్‌ గేమ్స్‌లో అండర్‌–14 రాష్ట్రస్థాయి పోటీలలో ఉమ్మడి గుంటూరు జిల్లా తరఫున హాకీ పోటీలలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగే జాతీయస్థాయి హాకీ పోటీలలో విద్యార్థిని పాల్గొంటారని వ్యాయామ ఉపాధ్యాయులు టి.వాణి సునీల, కె.బాలకృష్ణ తెలిపారు. అనూషను గ్రామ సర్పంచ్‌ పూల నాగమణి, స్కూల్‌ మేనేజ్మెంట్‌ కమిటీ చైర్మన్‌ షేక్‌ ఆదాం ఉపాధ్యాయులు అభినందించారు.

గుంటూరు రూరల్‌: మండలంలోని చౌడవరంలో గల కళ్లం ఇంజినీరింగ్‌ కళాశాలలో జాతీయ స్థాయి విద్యార్థుల సాంకేతిక మేనేజ్‌మెంటు సదస్సు (సంకల్ప్‌ 2025) గోడ ప్రతులను గురువారం కళాశాల చైర్మన్‌ కళ్లం మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంకల్ప్‌ పేరుతో ఏటా విద్యార్థుల్లో నైపుణ్యతలను మెరుగు దిద్దేందుకు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంటామని తెలిపారు. కళాశాల డైరెక్టర్‌ ఎం. ఉమాశంకరరెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది డిసెంబర్‌ 19, 20వ తేదీల్లో సంకల్ప్‌ సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో పెద్దఎత్తున రాష్ట్ర, జాతీయ స్థాయి ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు పాల్గొంటారన్నారు. సాంకేతిక, మేనేజ్‌మెంటు విభాగాలలో ప్రతిభ పాటవాలను ప్రదర్శించడం ద్వారా పెద్దఎత్తున పారితోషికాలు కూడా అందుకుంటారని వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ బి.ఎస్‌.బి. రెడ్డి, కళ్లం భరద్వాజ, సంకల్ప్‌ నిర్వహణ సంచాలకులు హనుమంత్‌ప్రసాద్‌, కళాశాల డీన్‌ ఉపాధి కల్పన విభాగం పీఎల్‌ మాధవరావు పాల్గొన్నారు.

పట్నంబజారు(గుంటూరు ఈస్ట్‌): డిసెంబరు 1 నుంచి 20వ తేదీ వరకు ఏపీఎస్‌ఆర్టీసీ ఏసీ బస్సుల్లో పదిశాతం రాయితీ కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి బి.సాంబ్రాజ్యం గురువారం తెలిపారు. గుంటూరు – బీహెచ్‌ఈఎల్‌ వయా మంగళగిరి అమరావతి బస్సు చార్జి గతంలో రూ. 870లు ఉండగా, ఇప్పుడు రూ. 790కి తగ్గిందన్నారు. గుంటూరు – బీహెచ్‌ఈఎల్‌ వయా విజయవాడ అమరావతి బస్సుల చార్జీ గతంలో రూ. 970లు ఉండగా, రూ. 880లకు తగ్గించినట్లు వెల్లడించారు. గుంటూరు – బీహెచ్‌ఈఎల్‌ వయా మంగళగిరి ఇంధ్ర బస్సు చార్జీ రూ. 700 ఉండగా, డిసెంబరు 1 నుంచి రూ. 640 తగ్గిందన్నారు. తెనాలి – బీహెచ్‌ఈఎల్‌ ఇంధ్ర బస్సు రూ. 710, తెనాలి – విశాఖపట్నం బస్సు చార్జీ రూ. 850లకు తగ్గించినట్లు తెలిపారు.

పట్నంబజారు (గుంటూరు ఈస్ట్‌): బాలికను కిడ్నాప్‌ చేసి లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై కేసు నమోదైంది. కొత్తపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెహ్రూనగర్‌కు చెందిన ఓ బాలిక ఇంటర్‌ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన రాకేష్‌ అనే యువకుడు బాలికను గత రెండు నెలల క్రితం మాయమాలు చెప్పి బలవంతంగా ఎత్తుకెళ్లాడు. పలు ప్రాంతాలకు తీసుకెళ్లి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జాతీయస్థాయి హాకీ పోటీలకు మేడికొండూరు విద్యార్థిని 1
1/2

జాతీయస్థాయి హాకీ పోటీలకు మేడికొండూరు విద్యార్థిని

జాతీయస్థాయి హాకీ పోటీలకు మేడికొండూరు విద్యార్థిని 2
2/2

జాతీయస్థాయి హాకీ పోటీలకు మేడికొండూరు విద్యార్థిని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement