వైద్య ఆరోగ్య శాఖ విధులకు హాజరు కారు
సచివాలయ ఏఎన్‌ఎంలు
గుంటూరు మెడికల్: సచివాలయ ఏఎన్‌ఎంలకు కేవలం వైద్య ఆరోగ్య శాఖ విధులకు పరిమితం చేసేవరకు వారు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి విధులకు హాజరు కారని ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు తెలిపారు. పలువురు సచివాలయ ఏఎన్‌ఎంలు ఏపీ ఎన్జీఓ నేతలను కలిసి తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఘంటసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన ఏఎన్‌ఎంలకు ఇతర విధులు అప్పజెప్పకూడదనే స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ వాటి అమలులో విఫలమవుతున్నట్లు వెల్లడించారు. ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు తాము అండగా ఉంటామన్నారు. గుంటూరు అర్బన్ సచివాలయాల పరిధిలోని ఏఎన్‌ఎంలు వారి విభాగంలోని విధులనే కాకుండా, మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన అనేక సర్వేలు నిర్వహించాలని మున్సిపల్ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు వెల్లడించారు. ఏఎన్‌ఎంలపై ఒత్తిడి తగ్గించడానికి డీఎంహెచ్‌ఓ జోక్యం చేసుకుని కేవలం వైద్య ఆరోగ్య శాఖకు చెందిన విధులు మాత్రమే ఏఎన్‌ఎంలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని పలుమార్లు విన్నపాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఈనేపథ్యంలో శుక్రవారం నుంచి సచివాలయ ఏఎన్‌ఎంలు వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన విధులకు హాజరు కారని ఘంటసాల శ్రీనివాసరావు వెల్లడించారు. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఆరాధ్యుల శ్యామ్‌సుందర శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నాగూర్ షరీఫ్, నగర అధ్యక్షుడు ఎస్.పి.ఎస్.సూరి, కార్యదర్శి సి.హెచ్.కళ్యాణ్‌కుమార్, శ్రీధర్‌రెడ్డి, కృష్ణకిషోర్, అబ్దుల్ కరీం, శేషగిరిరాజు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.
పీఆర్సీ కమిటీ త్వరగా ఏర్పాటు చేయాలి..
పీఆర్సీ కమిటీ త్వరగా ఏర్పాటు చేయాలని ఈహెచ్‌ఎస్ ద్వారా క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ జరగాలని ఏపీ ఎన్జీజీవో కార్యవర్గం తీర్మానించింది. ఈమేరకు గురువారం గుంటూరులోని ఏపీ ఏన్జీజీవో అసోసియేషన్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికై న నగరశాఖ కార్యవర్గ సమావేశం జరిగింది. నూతనంగా ఎన్నికై న నగర అధ్యక్షుడు ఎస్.పి.ఎస్.సూరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 20 ఈసీ సభ్యుల కో–ఆప్షన్ ఎన్నిక నిర్వహించారు. నూతనంగా ఎన్నికై న కార్యదర్శి సి.హెచ్.కళ్యాణ్‌కుమార్ ప్రవేశపెట్టిన అజెండా తీర్మానాలపై చర్చ నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల ఏఎన్‌ఎంలకు కేవలం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన విధులు మాత్రమే అప్పజెప్పే విధంగా జిల్లా, రాష్ట్ర నాయకత్వాలు ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకెళ్లాలని తీర్మానించారు. ఎన్జీవో సమాచారం, సభ్యత్వం పెంపొందించాలని, రావాల్సిన బకాయిలు, జీఎస్ సరెండర్ లీవుల గురించి చర్చించారు. నూతనంగా ఎన్నికై న నగర అధ్యక్ష, కార్యదర్శులను జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, కార్యదర్శి ఆరాధ్యుల శ్యామ్‌సుందర్ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నాగూల్ షరీఫ్ తదితరులు అభినందించారు. ఉద్యోగల సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు పోరాట పటిమతో నగర నూతన కార్యవర్గం ముందుకు వెళ్లాలని నేతలు సూచించారు.
ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు
ఘంటసాల శ్రీనివాసరావు
వైద్య ఆరోగ్య శాఖ విధులకు హాజరు కారు


