సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ దరఖాస్తుల గడువు పొడిగిం
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణకు సంబంధించిన దరఖాస్తులు డిసెంబర్ 3వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని ఏపీ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.మయూరి గురువారం ఓ ప్రకటనలో తెలియజేశారు. అర్హత కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన అభ్యర్థులు ఈ నెల 3వ తేదీలోగా రాజాగారితోట, గుంటూరులోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు డిసెంబర్ 7వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఆయా సెంటర్లలలో స్క్రీనింగ్ పరీక్ష ఉంటుందన్నారు. ఇతర వివరాలకు 0863–2358071 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
తెనాలి రూరల్: డ్వాక్రా గ్రూపునకు సంబంధించి బ్యాంకులో నెల నెలా చెల్లించాల్సిన నగదు పూర్తిగా జమ కాకపోవడం, సుమారు రూ. 8లక్షలు పైగా అవకతవకలు జరగడంపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తెనాలి నందులపేట కవిరాజ పార్కు ప్రాంతంలోని ఓ డ్వాక్రా గ్రూపునకు మూడేళ్లగా క్రితం రూ. 15 లక్షల రుణం మంజూరైంది. సభ్యులందరూ ప్రతి నెల క్రమం తప్పకుండ 36 నెలల పాటు వాయిదాలు చెల్లించుకుంటూ వచ్చారు. అక్టోబరుతో వాయిదాల గడువు ముగియడంతో తమకు రావాల్సిన పొదుపు మొత్తం గురించి వాకబు చేయగా బ్యాంకుకు ఇంకా రూ.8 లక్షలు చెల్లించాల్సి ఉందని సభ్యులకు తెలిసింది. దీంతో అవాకై ్కన సభ్యులు జిల్లా కలెక్టరుకు, డీఎస్పీకి, సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై బుధవారం రాత్రి టూ టౌన్ పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు విచారిస్తున్నారు.
దుగ్గిరాల: విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ నుంచి 3,225 క్యూసెక్కులను దిగువకు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటిమట్టం స్థిరంగా ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవల్‌కి 196 క్యూసెక్కులు, బ్యాంక్ కెనాల్‌కు 388 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 30, పశ్చిమ కాలువకు 0, నిజాంపట్నం కాలువకు 87, కొమ్మూరు కాలువకు 1,983 క్యూసెక్కులను బ్యారేజీ నుంచి విడుదల చేశారు.


