బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సుబ్బ
గుంటూరు మెడికల్: బీజేపీ కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వై.వి.సుబ్బారావును నియమిస్తూ పార్టీ రాష్ట్రకార్యవర్గం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీలో 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న తనను గుర్తించి, తనకు కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించిన కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కుమార స్వామికి సుబ్బారావు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పజెప్పిన బాధ్యతలను నిబద్ధత, నిజాయితీతో నిర్వర్తించి రైతుల సమస్యల పరిష్కారానికి అంకితంమవుతానని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ప్రధాన కార్యదర్శి మధుకర్, జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావులకు కృతజ్ఞతలు తెలిపారు.


