చంపుతామని బెదిరిస్తున్నారు
గుంటూరు వెస్ట్ : ‘‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ప్రజలకు ఎంతో ఉపయోపడేది.. వారి సమస్యల పరిష్కారంపై కొందరు అధికారులు, సిబ్బంది పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.. ఇది మంచి పద్ధతి కాదు.. ప్రజలతో మర్యాదగా మసలుకోండి.. వారితో అమర్యాదగా మాట్లాడవదు.. ఎన్నిసారు చెప్పినా మార్పు లేకపోతే ఇక చర్యలకు వెనుకాడన’’ని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, అధికారులతో కలసి నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ మాట్లాడారు. కొన్ని అర్జీలు కోర్టు పరిధిలో ఉండడంతో పాటు వ్యక్తిగత కక్షలతో కొందరు వస్తున్నారని, వారికి అర్థమయ్యేట్లు చెప్పి పంపాలని ఆదేశించారు. నెల రోజుల సమయం మాత్రమే ఉందని, అర్జీలను పెండింగ్‌లో పెట్టుకోవద్దని ఆదేశించారు. అనంతరం వచ్చిన 247 అర్జీలను అధికారులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కె.కల్యాణ చక్రవర్తి, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగసాయి కుమార్, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి సత్యనారాయణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
నేను గోరంట్ల సమీపంలోని ఏసన్న మందిరం వద్ద 425 చ.గ. కొనుగోలు చేసి హక్కుదారుల నుంచి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నా. టీడీపీ, జనసేన పార్టీకి చెందిన కొందరు గూండాలు వచ్చి స్థలంలో నాపై దాడి చేశారు. నా ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. మళ్లీ వచ్చి ‘‘ప్రభుత్వం మాది.. మమ్మల్ని ఏమీ చేయలేరు.. ఖాళీ చేసి వెళ్లకపోతే చంపుతామ’’ని బెదిరిస్తున్నారు. గూండా గిరి చేస్తున్న వారిపై చర్యలు తీసుకుని, నాకు న్యాయం చేయాలి.
–డి.వెంకటరెడ్డి, గోరంట్ల


