19, 20వ తేదీల్లో ఆదర్శ్–2025
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు నగరంఅమరావతిరోడ్డులోని హిందూ ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 19, 20వ తేదీల్లో ఆదర్శ్–2025 పేరుతో రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ ఫెస్ట్ నిర్వహించనున్నట్లు కళాశాల డైరెక్టర్ డాక్టర్ పీఎం ప్రసాద్ తెలిపారు. సోమవారం కళాశాలలో బ్రోచర్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులకు చెస్, క్యారమ్స్, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, పికెల్ బాల్, షాట్‌ఫుట్, త్రోబాల్ పోటీలను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆయా పోటీల్లో విజేతలకు రూ.రెండు లక్షల వరకు నగదు బహుమతులు అందజేస్తామని వివరించారు. పోటీల్లో పాల్గొనేందుకు వచ్చే విద్యార్థులు, కోచ్‌లకు భోజన, వసతి సదుపాయాలు కల్పించేందుకు నిర్ణయించామని, ఎటువంటి ఎంట్రీ రుసుం చెల్లించాల్సిన అవసరం లేకుండా విద్యార్థులు పాల్గొనవచ్చునని వివరించారు. విద్యార్థుల్లో శారీరక, మానసిక ఉల్లాసాన్ని కలిగించేందుకు పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పేర్లు నమోదుకు 63021 78787, 81214 24642 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. వివరాలకు కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి, ప్రోగ్రామ్ ఆర్గనైజర్ సుష్మ, సీహెచ్ సుబ్బారావు, వజ్రాల నర్సిరెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.


