రాష్ట్రంతోపాటు దేశమంతా మా శిల్ప కళ అద్భుతం అంటారు. ఎంత కష్టపడినా న్యాయం జరగటం లేదు. శిల్ప కళలను పెంపొందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కేవలం కళను బతికించాలనే కష్టనష్టాలను భరించి ఈ వృత్తిలో కొననసాగుతున్నాం. ప్రోత్సాహం లభిస్తే మరికొందరు యువకులు ఈ రంగంలో రాణించడానికి ముందుకు వస్తారు. ప్రభుత్వం విద్యుత్‌ను సబ్సిడీతో ఇవ్వాలి, శిల్ప కళాకారులకు వసతి గృహాలను నిర్మించాలి. క్వారీలకు ప్రభుత్వం రాయల్టీ కల్పించాలి.
– మల్లె రామాంజనేయులు, సాయి శివ దుర్గ శిల్ప కళా కేంద్ర నిర్వాహకుడు, దుర్గి.


