నేడు ఆచార్య ఎన్జీరంగా జయంతి వేడుకలు
గుంటూరు రూరల్: పద్మవిభూషణ్ ఆచార్య ఎన్.జి. రంగా 125వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నగర శివారులోని లాంఫాం నందున్న ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని కృష్ణ ఆడిటోరియంలో వేడుకలు నిర్వహించనున్నారు. ఆచార్య ఎన్.జి.రంగా ట్రస్ట్ సభ్యులు రామినేని కిషోర్‌బాబు, టి.యుగంధర్, బి.నాగేశ్వర్‌మిత్రలు గురువారం ఈ మేరకు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా ప్రజా ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.
పెదకాకాని: ప్రపంచ తెలుగు బాలల పండుగ వీవీఐటీయూ బాలోత్సవ్ – 2025 సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీ ప్రాంగణంలో సర్వం సిద్ధం చేశామని చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. మండలంలోని నంబూరు వీవీఐటీయూలో గురువారం ఆయన మాట్లాడుతూ.. 20 అంశాలు, 61 విభాగాలలో పోటీలు నిర్వహించేందుకు 32 వేదికలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వసతి కోసం 73862 25336 ఫోను నంబరును సంప్రదించాలన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల విద్యార్థులకు 43 రూట్లలలో బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రో చాన్సలర్ వాసిరెడ్డి మహదేవ్ మాట్లాడుతూ.. 600 మంది ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు వలంటీర్లుగా సేవలు అందిస్తారన్నారు. విజేతలకు కొండపల్లి విశిష్ట జోడుఎడ్ల బొమ్మలను బహుమతిగా అందించనున్నట్లు తెలిపారు.
అమరావతి: స్థానికంగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలను గురవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని వంట గది, మరుగు దొడ్లు, తరగతి గదులు పరిశీలించి విద్యార్థులను సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఉమ్మడి జిల్లాకొక ప్రత్యేక వైద్యాధికారిని నియమించామని తెలిపారు.
గుంటూరు రూరల్: ఘన వ్యర్థాలను పర్యావరణహితంగా నిర్వహించడానికి, నగరాల్లో డంపింగ్ యార్డ్‌లు లేకుండా చేయడానికి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌లు దోహదపడతాయని తమిళనాడు డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ (డీఎంఏ) పి. మధుసూదన్‌రెడ్డి తెలిపారు. గురువారం గుంటూరు రూరల్ మండలం నాయుడుపేటలోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను నగర కమిషనర్ పి. శ్రీనివాసులుతో కలిసి ఆయన సందర్శించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ స్టడీ టూర్‌లో భాగంగా తమిళనాడు మున్సిపల్ విభాగం నుంచి గుంటూరు వచ్చిన డీఎంఏ, మదురై కార్పొరేషన్ కమిషనర్ చిత్ర విజయన్, హోసూర్ కార్పొరేషన్ ఈఈ విక్టర్ జ్ఞానరాజ్, ఏఈ (డీఎంఏ) రవి చంద్రన్‌లు ప్లాంట్, నగరంలోని ఎంఆర్‌ఎఫ్, వెట్, విండ్రో, వర్మి కంపోస్ట్ యూనిట్లను పరిశీలించారు. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ జిందాల్ ప్లాంట్ నిర్వహణలో గుంటూరు నగరపాలక సంస్థ నోడల్ కార్పొరేషన్‌గా ఉండి, ప్రతి రోజు సుమారు నాలుగు వందల టన్నుల వ్యర్థాలను పంపుతున్నామన్నారు. దీని వలన గుంటూరు నగరంలో ఎక్కడా డంపింగ్ యార్డ్‌లు లేకుండా వీలు పడుతుందన్నారు.
నేడు ఆచార్య ఎన్జీరంగా జయంతి వేడుకలు
నేడు ఆచార్య ఎన్జీరంగా జయంతి వేడుకలు


