మార్కెట్‌లోకి కుశలవ హ్యుందాయ్ వెన్యూ కారు
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): స్థానిక ఆటోనగర్‌లోని కుశలవ హ్యుందాయ్ షోరూంలో బుధవారం హ్యుందాయ్ వెన్యూ కారును మార్కెట్‌లోకి విడుదల చేశారు. సంస్థ ఎండీ చుక్కపల్లి సిద్ధార్థ మాట్లాడుతూ సరికొత్త హ్యాందాయ్ వెన్యూ వెర్షన్ ధర రూ.7.89 లక్షల నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఏడు లక్షల మంది వినియోగదారులు వెన్యూ కారుని వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కారు విశాలంగా, నూతన హంగులతో ఉంటుందన్నారు. కార్యక్రమంలో సీనియర్ మేనేజర్ ధీరజ్ స్వరూప్, జీఎం శ్రీధర్, సేల్స్ హెడ్ ఉస్మాన్, ఇనిస్టిట్యూషనల్ హెడ్ అఖద్ ప్రతాప్‌సింగ్, ఆటోమొబైల్ ఔత్సాహికులు, కస్టమర్లు పాల్గొన్నారు.


