30న గుంటూరులో మెగా జాబ్‌మేళా
గుంటూరు వెస్ట్: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీన మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లోని ఆమె చాంబర్‌లో జాబ్‌మేళా పోస్టర్‌ను కలెక్టర్ శనివారం విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ 30వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పొన్నూరు రోడ్డులో ఉన్న ఆంధ్రా ముస్లిం కళాశాల ప్రాంగణంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. దాదాపు 30కి పైగా కంపెనీలు పాల్గొంటున్నాయని వివరించారు. 935 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇటువంటి జాబ్‌మేళాలను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కొండా సంజీవరావు మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు మహ్మద్ నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మెగా జాబ్‌మేళాలో 10వ తరగతి నుంచి బీటెక్ వరకు విద్యార్హత కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. విద్యార్హత, ఉద్యోగం అనుసరించి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు జీతం ఉంటుందని చెప్పారు. ఎస్.ఎస్.సి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, డిప్లమా, ఫార్మసీ, పీజీ విభాగాల్లో విద్యార్హత ఉన్న 18–25 సంవత్సరాల వయస్సు గల నిరుద్యోగ యువతీ, యువకులు బయోడేటా లేదా రెస్యూమ్, విద్యార్హత సర్టిఫి కేట్స్ జిరాక్స్, ఆధార్ నకలు, పాస్‌పోర్ట్ ఫొటోతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చని వివరించారు. వివరాలకు డి.నరేష్ (98663 66187), రామకృష్ణారెడ్డి (7731982861), ఎన్.కృపానందం (9581794605), టోల్‌ఫ్రీ: 9988853335, 8712655686, 8790118349, 8790117279 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని అన్నారు. ఆసక్తి ఉన్న యువతీ, యువకులు రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేయకుండా ఉన్న యువతీ, యువకులు జాబ్‌మేళా జరుగు ప్రదేశంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని చెప్పారు. కార్యక్రములో సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు యు.చెన్నయ్య పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా


