షూటర్ ముఖేష్‌కు ఘన సన్మానం
గుంటూరు వెస్ట్(క్రీడలు): జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ చాంపియన్‌షిప్ పోటీలలో నేలవల్లి ముఖేష్ సత్తా చాటాడు. ఇటీవల ద నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఢిల్లీలో ఇటీవల పోటీలు నిర్వహించారు. శనివారం స్థానిక విద్యానగర్‌లోని షూటింగ్ అకాడమీలో నిర్వహించిన కార్యక్రమంలో పోటీలలో బంగారు, రజత పతకాలు సాధించిన ముఖేష్‌ను ద ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్స్ డైరెక్టర్ అండ్ చీఫ్ కోచ్ నాగిశెట్టి సుబ్రహ్మణ్యేశ్వర రావు ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి మరిన్ని అంతర్జాతీయ పథకాలు సాధించి ఒలంపిక్ పథకాన్ని కై వశం చేసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. గుంటూరు షూటింగ్ హబ్‌గా మారిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక పతకాలు మన జిల్లాకే వస్తున్నాయని పేర్కొన్నారు. గ్లోబల్ స్పోట్స్ ఫౌండేషన్ చైర్మన్ శివ ప్రసాద్ మాట్లాడుతూ మన రాష్ట్రానికి జూనియర్ వరల్డ్ కప్‌లో పతకాలు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. షూటింగ్ క్రీడకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆదరణ ఉంటే పేద కటుంబాలకు చెందిన క్రీడాకారులు వెలుగులోకి వస్తారన్నారు. కార్యక్రమంలో ముఖేష్ తల్లిదండ్రులు నేలవల్లి శ్రీనివాసరావు, మాధవి పాల్గొన్నారు.


