గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Oct 26 2025 8:17 AM | Updated on Oct 26 2025 8:17 AM

గుంటూ

గుంటూరు

ఆదివారం శ్రీ 26 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025 పులిచింతల ప్రాజెక్టు సమాచారం నిత్యాన్నదాన పథకానికి విరాళం

న్యూస్‌రీల్‌

ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి గతంలో వచ్చిన తుపాన్ల కంటే తీవ్రత అధికంగా ఉండే అవకాశం కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూము ఏర్పాటు జిల్లా కలెక్టర్‌ ఎ.తమీమ్‌ అన్సారియా

ఆదివారం శ్రీ 26 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 12,674 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 17,000 క్యూసెక్కులు వదులుతున్నారు.

మంగళగిరి టౌన్‌: శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో నిత్య అన్నదాన పథకానికి పెనుమాక గ్రామ భక్తులు శనివారం విరాళాలు అందజేశారు.

గుంటూరు వెస్ట్‌: మోంథా తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ ఎ.తమీమ్‌ అన్సారియా ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ, జీఎంసీ కమిషనర్‌ పులి శ్రీనివాసులు, ఇతర అధికారులతో కలెక్టర్‌ అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తుపాను ఈ నెల 28వ తేదీ సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసిందని తెలిపారు. దాని ప్రభావంతో గంటకు 90 నుంచి 100 కి.మీ.ల వేగంతో ఈదురు గాలులు వీయవచ్చని చెప్పారు. ఈ నెల 26వ తేదీ ఆదివారం నుంచి తుపాను ప్రభావం కనిపిస్తుందని తెలిపారు. అదే సమయంలో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తుపాను ప్రభావం గతంలో వచ్చిన వాటికంటే ఎక్కువగా ఉండొచ్చని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అధికారులు రానున్న నాలుగు రోజులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలను సురక్షితమైన పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈదురుగాలులకు కూలేందుకు అవకాశం ఉన్న చెట్లు, విద్యుత్‌ స్తంభాలను ముందుగానే గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలి

తుపాను హెచ్చరిక నేపథ్యంలో తీసుకునే అన్ని చర్యలు పటిష్టంగా ఉండాలన్నారు. అధికారులు సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని, కూలిన చెట్లను తొలగించేందుకు అవసరమైన సామగ్రిని, యంత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అన్ని మండలాల్లో, మున్సిపాలిటీల్లో 24 గంటలు పనిచేసేలా వెంటనే కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో అన్ని శాఖల ఉద్యోగులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. వరద ప్రభావం తగ్గించడానికి చెరువులు, కాలువలు, నదులు వంటి నీటి వనరుల వద్ద పరిస్థితిని నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామని, 0863– 2234014 నంబరుకు కాల్‌ చేసి సమస్యలు చెప్పవచ్చని తెలిపారు. సమావేశంలో డీఆర్వో షేఖ్‌ ఖాజావలి, జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ విజయలక్ష్మి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.రమణ యశస్వి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవీంద్రబాబు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ కల్యాణ చక్రవర్తి, పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజరు జయలక్ష్మి, మెప్మా పీడీ విజయ లక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

పాఠశాలలకు 3 రోజులు సెలవులు

తుపాను దృష్ట్యా జిల్లాలోని పాఠశాలలకు ఈ నెల 27, 28, 29వ తేదీలలో సెలవులు ఇస్తున్నట్లు కలెక్టర్‌ శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. పిల్లలను బయటకు పంపవద్దని తల్లిదండ్రులను కోరారు. అదే విధంగా సోమవారం జరగాల్సిన పీజీఆర్‌ఎస్‌ రద్దు చేసినట్లు తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

7

5 మండలాలకు

తుపాను ప్రభావం అత్యంత భారీగా ఉండవచ్చని జిల్లా అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ముందస్తు జాగ్రత్తలు, ఏర్పాట్లు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాతోపాటు జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ, జిల్లా అధికారుల ఆధ్వర్యంలో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి బుధవారం వరకు తుపాను ప్రమాదం పొంచి ఉంటుందని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా తుపాను ప్రభావం జిల్లాలోని దుగ్గిరాల, కొల్లిపర, మంగళగిరి, తాడేపల్లి, తుళ్ళూరు మండలాల్లో అత్యంత భారీగా ఉండవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయింది. ఈ ఐదు ప్రాంతాల్లో 115.7 నుంచి 204.6 మిల్లీ మీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. మరో 11 మండలాలైన చేబ్రోలు, గుంటూరు వెస్ట్‌, గుంటూరు ఈస్ట్‌, కాకుమాను, మేడికొండూరు, పెదకాకాని, పొన్నూరు, ప్రత్తిపాడు, తాడికొండ, తెనాలి, వట్టిచెరుకూరులో 64.6 నుంచి 115.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మరో 2 మండలాలు పెదనందిపాడు, ఫిరంగిపురం ప్రాంతాల్లో 15.7 నుంచి 64.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా నిత్యావసర సరకులతోపాటు అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

గుంటూరు1
1/7

గుంటూరు

గుంటూరు2
2/7

గుంటూరు

గుంటూరు3
3/7

గుంటూరు

గుంటూరు4
4/7

గుంటూరు

గుంటూరు5
5/7

గుంటూరు

గుంటూరు6
6/7

గుంటూరు

గుంటూరు7
7/7

గుంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement