భక్తిశ్రద్ధలతో కార్తిక దీపారాధన పూజలు
పెదకాకాని: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెదకాకాని శివాలయంలో కార్తిక మాస పూజలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. పెదకాకాని శ్రీమల్లేశ్వరస్వామి సన్నిధిలో కార్తిక మాసం శనివారం నాగుల చవితిని పురస్కరించుకుని భక్తుల సందడి నెలకొంది. భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు, పందిళ్లు తదితర సౌకర్యాలు కల్పించారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణంలోని యజ్ఞాల బావి నీటితో స్నానాలు చేసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వెంట తెచ్చుకున్న పూజా సామగ్రితో కార్తిక దీపాలు వెలిగించి, పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని నాగేంద్రునికి పాలు పోసి భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. ఆది, సోమ వారాల్లో ఆలయానికి అధికసంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఏర్పాట్లను ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ పర్యవేక్షించారు.
భక్తిశ్రద్ధలతో కార్తిక దీపారాధన పూజలు
భక్తిశ్రద్ధలతో కార్తిక దీపారాధన పూజలు
భక్తిశ్రద్ధలతో కార్తిక దీపారాధన పూజలు


