ప్రజా ఉద్యమాన్ని జయప్రదం చేయాలి
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 28వ తేదీన నిర్వహించతలపెట్టిన ప్రజా ఉద్యమాన్ని జయప్రదం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. బృందావన్‌గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా, తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, జిల్లా మాజీ అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావులతో కలసి అంబటి పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 28వ తేదీన ప్రజా ఉద్యమం జరుగుతుందని వివరించారు. అందులో భాగంగా నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రజల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తోందని, మెడికల్ కళాశాల ప్రైవేటీకరణపై నిరసన గళం వినిపించేందుకు ప్రజాస్వామ్య వాదులు, ఉద్యమకారులు, మేధావులు తరలిరావాలని కోరారు. పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం తప్పదన్న విషయాన్ని కూటమి ప్రభుత్వం గ్రహించాలన్నారు. ఇప్పటికే కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. 28న జరిగే ప్రజా ఉద్యమ కార్యక్రమం కూటమి పతనానికి సంకేతాన్ని ఇవ్వబోతోందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నిమ్మకాయల రాజనారాయణ, గులాం రసూల్, అనుబంధ విభాగాల అధ్యక్షులు పఠాన్ సైదా ఖాన్, ఆళ్ల ఉత్తేజ్‌రెడ్డి, దానం వినోద్, సత్తెనపల్లి రమణి, యేటి కోటేశ్వరరావు యాదవ్, కొరిటెపాటి ప్రేమ్‌కుమార్, రూత్‌రాణి, అనిల్‌రెడ్డి, పార్టీ నేతలు చింతపల్లి రమణ, సూరసాని వెంకటరెడ్డి, రెడ్డి కోటేశ్వరరావు, కోటి, తోట వెంకటేశ్వర్లు, సుబ్బారావు, ఓర్సు శ్రీనివాసరావు, అరవింద్, కొల్లు శివప్రసాద్, భాస్కర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
అంబటి పిలుపు


