
పశ్చిమ డెల్టాకు 4,513 క్యూసెక్కులు విడుదల
దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి 4,513 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 12 అడుగుల నీటిమట్టం స్థిరంగా ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవల్‌కి 216 క్యూసెక్కులు, బ్యాంక్ కెనాల్ 1,526 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 327, పశ్చిమ కాలువకు 118, నిజాంపట్నం కాలువకు 281, కొమ్మూరు కాలువకు 2,800 క్యూసెక్కులు బ్యారేజి నుంచి విడుదల చేశారు. సముద్రంలోనికి 43,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
నేటి పోలీస్ గ్రీవెన్స్
తాత్కాలికంగా రద్దు
నగరంపాలెం: దీపావళి పండుగ సందర్భంగా సోమవారం గుంటూరు నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలు గమనించాలని అన్నారు.
రెడ ్లసత్రానికి
రూ.5 లక్షల విరాళం
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ శ్రీ యోగి వేమారెడ్డి రెడ్ల సత్రంలో లిఫ్ట్ ఏర్పాటుకు పట్టణానికి చెందిన వెన్నపూస జోసెఫ్‌రెడ్డి రూ.5 లక్షల విరాళం అందజేశారు. సత్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో విరాళం మొత్తాన్ని దాత జోసెఫ్‌రెడ్డి సత్రం కమిటీ సభ్యులకు అందించారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు భవనం రాఘవరెడ్డి, కార్యదర్శి పొలిమేర వెంకటరెడ్డి, కోశాధికారి మాగులూరి సుబ్బారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టు పాపిరెడ్డి, ఉపాధ్యక్షడు నరసింహారెడ్డి, జాయింట్ సెక్రటరీలు బ్రహ్మరెడ్డి, శ్రీనివాసరెడ్డి, మాజీ కార్యదర్శి ఈశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లాంచీస్టేషన్‌ను సందర్శించిన
డివిజనల్ మేనేజరు
విజయపురిసౌత్: పర్యాటక శాఖ విజయవాడ డివిజనల్ మేనేజర్ చైతన్య ఆదివారం విజయపురిసౌత్‌లోని లాంచీ స్టేషన్‌ను సందర్శించారు. ముందుగా లాంచీలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ లాంచీల్లో సందర్శకుల భద్రతకు ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో హరిత రిసార్ట్ మేనేజర్ మస్తాన్‌బాబు, ఎత్తిపోతల మేనేజర్ యల్లాల బ్రహ్మం, వినయతుల్లా, దత్తు, పులుసు వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సాగర్ నీటిమట్టం వివరాలు
విజయపురిసౌత్: నాగార్జుసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 588.40 అడుగులకు చేరింది. ఇది 307.2834 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 9,302, ఎడమ కాలువకు 8,718, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 33,292, ఎస్‌ఎల్‌బీసీకి 1,800, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 53,412 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 53,412 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
మహాదేవిగా పూజలందుకున్న బగళాముఖి
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో బగళాముఖి అమ్మ వారు ఆదివారం మహాదేవి అలంకరణలో పూజలందుకున్నారు. భక్తుల కొంగు బంగారంగా బాసిల్లుతున్న బగళాముఖి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి పూలు, పండ్లు సమర్పించారు. పూజలు చేశారు. సోమవారం అమావాస్య సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో 81వ అమావాస్య హోమం, విశేష పూజలు నిర్వహించనున్నామని ఆలయ కార్యనిర్వాహణాధికారి జి.నరసింహమూర్తి తెలిపారు.

పశ్చిమ డెల్టాకు 4,513 క్యూసెక్కులు విడుదల

పశ్చిమ డెల్టాకు 4,513 క్యూసెక్కులు విడుదల