
అవగాహన ముఖ్యం
రోజూ వ్యాధి బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. ఓపీకి వచ్చే వారిలో 25 శాతం మంది ఈ వ్యాధి బాధితులే. యువకులు కూడా ఈ వ్యాధి బారిన పడడం ఆందోళనకరమైన అంశం. కొన్నిసార్లు వైద్య పరీక్షల్లో రిపోర్టులు నార్మల్‌గా ఉన్నా నొప్పులు ఉంటాయి. నొప్పులు ఉంటే వ్యాధిగా గుర్తించి చికిత్స చేయించుకోవాలి. ఈ వ్యాధి వల్ల వెన్నెముక కూడా బోలుగా మారిపోయి కొద్దిపాటి దెబ్బకే విరిగిపోయి జీవితం చాలా దుర్భరంగా మారుతుంది. కీళ్లవాతం, కిడ్నీ వ్యాధులు, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారికి ఆస్టియోపొరోసిస్
వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీరు ముందస్తుగా పరీక్షలు చేయించాలి.
– డాక్టర్ జె. నరేష్‌బాబు, సీనియర్ స్పయిన్ సర్జన్, గుంటూరు