
క్యాల్షియం స్థాయిలు పెంచాలి
వ్యాధికి చికిత్సలో భాగంగా శరీరంలో క్యాల్షియం లెవల్స్ పెంచాలి. పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవటం ద్వారా క్యాల్షియం పెంచుకోవచ్చు. విటమిన్ – డి కోసం ప్రతిరోజూ కొంతసేపు ఎండలో ఉండాలి. వయస్సు మళ్లిన వారికి , గర్భిణులకు, గర్భసంచి తొలగింపు ఆపరేషన్ చేయించుకున్నవారికి, పీరియడ్స్ రావటం పూర్తిగా ఆగిపోయిన వారికి అదనంగా రోజూ విటమిన్–డి, క్యాల్షియం మాత్రలు ఇవ్వాలి. నిత్యం తగిన పోషకాహారాన్ని అందించాలి. పొగతాగటం, మద్యం సేవించటం వంటి చెడు అలవాట్లను అందరూ విడనాడాలి. రోజూ తప్పనిసరిగా అరగంటసేపైనా నడవాలి.
–డాక్టర్ సూరత్ అమర్‌నాథ్, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, గుంటూరు