
13న పెన్షన్ అదాలత్
గుంటూరు ఎడ్యుకేషన్: కృష్ణనగర్‌లోని ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) ప్రాంతీయ కార్యాలయంలో ఈ నెల 13న ఉదయం 11 గంటలకు పెన్షన్ అదాలత్, ప్రయాస్ వెబినార్ నిర్వహించనున్నట్లు పీఎఫ్ కార్యాలయ వర్గాలు గురువారం ఓ ప్రకటనలో తెలిపాయి. వ్యక్తిగతంగా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చునని, ఆన్‌లైన్, ఈ–మెయిల్, వాట్సాప్‌ల్లోనూ పంపవచ్చని పేర్కొన్నాయి. మెయిల్‌తో పాటు వాట్సాప్ నంబరు: 94946 57469, 0863–2344106, 2232921 నంబర్లకు ఫోన్ ద్వారా తెలియజేయాలని అధికారులు కోరారు. వెబ్ ఎక్స్ ఐడీ 2640 680 9421, పాస్‌కోడ్: ఈపీఎఫ్‌వో ఎట్ దరేట్ 1234 ద్వారా జాయిన్ కావాలని సూచించారు.
మరొకరికి తీవ్రగాయాలు
మేడికొండూరు: మేడికొండూరు మండలం గుండ్లపాలెం బస్టాండ్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. మృతుడిని పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామానికి చెందిన టెంపో డ్రైవర్ ఆల వెంకటేశ్వర్లుగా గుర్తించారు. టెంపో, ఎదురుగా వచ్చిన లారీ అతి వేగంగా ఢీకొనడంతో టెంపో ధ్వంసమైంది. మృతదేహం చెట్లలో ఇరుక్కుపోవడంతో స్థానికులు తీవ్రంగా శ్రమించి బయటకు తీశారు. మేడికొండూరు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ మార్చురీకి తరలించారు. లారీ డ్రైవర్ సయ్యద్ బాబావలికి సొంతూరు మేడికొండూరు మండలం పేరిచర్ల గ్రామం అని గుర్తించారు. ఆయనకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు.