
19న బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ద్వితీయ మహాసభ
నెహ్రూనగర్: బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ద్వితీయ మహాసభ ఈనెల 19న గుంటూరులో నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు జి.శివ పూర్ణయ్య తెలిపారు. ఆదివారం గుంటూరు తాలుకా పెన్షనర్స్ హోంలో మహాసభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ ఎంప్లాయీస్ సమస్యలు, ఉద్యోగులకు రిజర్వేషన్లు, ప్రమోషన్స్‌లో మెరిట్ కమ్ రోస్టర్ విధానం అమలుచేయడానికి తీసుకోవాల్సిన చర్యలు మీద చర్చించినట్లు తెలిపారు. ద్వితీయ మహాసభలో ప్రవేశపెట్టే తీర్మానాలు, సమావేశం విజయవంతం చేయడానికి అన్ని జిల్లాలలోని బీసీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, తరలివచ్చి మహాసభను విజయవంతం చేయాలని కోరారు.సమావేశంలో ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం వి. ప్రసాద్, గౌరవాధ్యక్షులు పి.వి.రమణయ్య, గుంటూరు ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కె. శ్రీనివాసులు పాల్గొన్నారు.