
బోధనా నైపుణ్యాలు పెంచుకోవాలి
పాఠశాల విద్య జేడీ శైలజ
నరసరావుపేట ఈస్ట్: మెగా డీఎస్సీ–2025లో ఎంపికై న ఉపాధ్యాయులు బోధనా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పాఠశాల విద్య జేడీ పి.శైలజ తెలిపారు. డీఎస్సీ జోన్–3 పరిధిలో పీజీటీ, టీజీటీలుగా ఎంపికై న ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను శనివారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయుల నియామకం చేపట్టిందని తెలిపారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఆమె చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం కలిగేలా కృషి చేయాలని హితవు పలికారు. విద్యార్థుల్లో సామర్థ్యాలు పెరిగేలా బోధన ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో పల్నాడు విద్యాశాఖ ఏడీ బి.వి.రమణ, ఎంఈఓలు ఎండీ. ఖాసిం, పి.సుధారాణి, ప్రధానోపాధ్యాయులు ఆర్.గోవిందరాజులు, వి.వెంకట్రావు, ఏఎంఓ పూర్ణచంద్రరావు, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు.