
రాష్ట్ర స్కూల్ గేమ్స్ టెన్నిస్ పోటీలకు ఎంపిక
గుంటూరు వెస్ట్ (క్రీడలు): శ్రీకాళహస్తిలో ఈనెల 7వ తేదీ నుంచి 9 వరకు జరగనున్న ఏపీ స్టేట్ స్కూల్ గేమ్స్ టెన్నిస్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఎన్టీఆర్ స్టేడియంకు చెందిన ఆరుగురు క్రీడాకారులు జిల్లా జట్టుకు ఎంపికయ్యారని టెన్నిస్ కోచ్ జీవీఎస్ ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులను రేమండ్స్ షో రూమ్ అధినేత టి.అరుణ్ కుమార్, ఏపీ రెరా సభ్యులు దామచర్ల శ్రీనివాసరావు, సహస్ర ఆర్థో అండ్ న్యూరో క్లినిక్ అధినేత డాక్టర్ ఎం. శివకుమార్, రక్షిత్, నాంచారయ్యలు అభినందించారు.
ఎంపికై న క్రీడాకారుల వివరాలు...
అండర్–19 బాలుర విభాగంలో కె.విన్సెంట్, ఊరుబంది లలిత్ కుమార్, బాలికల విభాగంలో సాధుర్ల కావ్య హర్షిత, అండర్–17 బాలుర భాగంలో గంటా దిశాంత్, ఇ.జి. హర్షవర్ధన్, అండర్– 14 బాలుర విభాగంలో కుంభ సాయి నాగ కళ్యాణ్‌లు ఎంపికయ్యారు.