
ఆటో డ్రైవర్లకు అండగా ప్రభుత్వం
గుంటూరు వెస్ట్: ఆటో డ్రైవర్లకు అండగా కూటమి సర్కార్ ఉంటుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శనివారం స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఆటోడ్రైవర్ల సేవలో పథకం కింద సాయం పంపిణీని పెమ్మసాని, గుంటూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, నసీర్ అహ్మద్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్రబాబుతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. జిల్లాలో 13,194 మంది ఖాతాల్లో దాదాపు రూ.20 కోట్లు జమ చేస్తున్నామన్నారు. డిప్యూటీ మేయర్ షేక్ సజీల, జిల్లా రవాణా అధికారి సీతారామ్ రెడ్డి, ఏపీ ఇండస్ట్రీస్ చైర్మన్ డేగల ప్రభాకర్, ఏపీ టెక్నాలజీస్ చైర్మన్ మోహన కృష్ణ, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వరరావు, జనసేన జిల్లా ఇన్‌చార్జి గాదె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర సహాయ మంత్రి
పెమ్మసాని చంద్రశేఖర్