
చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఏల్చూరి
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) అధ్యక్షునిగా ఏల్చూరి వెంకటేశ్వర్లు గెలుపొందారు. గుంటూరు జిన్నాటవర్ కూడలిలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష పదవికి ఏల్చూరి వెంకటేశ్వర్లు, రంగా బాలకృష్ణలు పోటీపడ్డారు. సోమవార ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. అర్ధరాత్రి దాటేవరకు లెక్కింపు చేపట్టారు. అధ్యక్షుడిగా ఏల్చూరి వెంకటేశ్వర్లు 721 ఓట్లతో రెండోసారి గెలిచారు. రంగా బాలకృష్ణకు 65 ఓట్లు వచ్చాయి. ఏల్చూరి ప్యానెల్‌లో ముగ్గురు కార్యదర్శులు, ఉపాధ్యక్షులుగా టీఎల్‌వీ వీరాంజనేయులు, వి.వెంకటనాగి రెడ్డితోపాటు మరో నలుగురు గెలిచినట్లు చాంబర్ శాశ్వత గౌరవాధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు మంగళవారం తెలిపారు. సుమారు 3,200 మంది వ్యాపారులకు చాంబర్‌లో సభ్యత్వం ఉండగా, ఓటేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. కేవలం 797 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఏల్చూరి