7న చలో విజయవాడకు ఫ్యాప్టో పిలుపు
7న చలో విజయవాడకు ఫ్యాప్టో పిలుపు ● గుత్తా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుంచి తప్పించడంతో పాటు, 12వ పీఆర్సీ, మధ్యంతర భృతి మంజూరు, పాత పెన్షన్ విధానం, ఆర్థిక బకాయిల చెల్లింపు, పెన్షనర్లకు కార్పొరేషన్ ఏర్పాటు వంటి హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తయినా ఏ ఒక్క హామీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని తెలిపారు.
● నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉద్యోగులకు స్నేహపూరిత ప్రభుత్వమని చెబుతూనే రాష్ట్రంలోని 12 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సంబంధించిన ఏ ఒక్క సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించిన, చర్చించిన పరిస్థితులు లేవన్నారు.
● కె. నరసింహారావు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు దాదాపు రూ.30 వేల కోట్ల ఆర్థిక బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం రోడ్ మ్యాప్ ప్రకటించాలని కోరినప్పటికీ ఇంతవరకు స్పందన లేదన్నారు.
● సెక్రటరీ జనరల్ కె.వీరాంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయ సంఘాలతో విద్యా రంగ, ఆర్థిక సమస్యలపై చర్చించి పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు, ఏపీటీఫ్ రాష్ట్ర కార్యదర్శి మేకల సుబ్బారావు, ఫ్యాప్టో జిల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎండీ ఖాలీద్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.కళాధర్, జి.వెళాంగిణీ రాజు, జిల్లా నాయకులు దిబ్బయ్య, ఎం.కోటిరెడ్డి, షేక్ బాజి బాలాజీ, ప్రసాద్, విజయానంద్ పాల్గొన్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఽఖ్య(ఫ్యాప్టో) పిలుపు మేరకు ఈ నెల 7న విజయవాడలోని ధర్నా చౌక్‌లో తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకులు నక్కా వెంకటేశ్వర్లు, గుత్తా శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా ఫ్యాప్టో చైర్మన్ కె.నరసింహారావు పిలుపునిచ్చారు. రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు ధర్నా సన్నాహక సమావేశాన్ని మంగళవారం నగరంపాలెంలోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు.