
అవయవ దానంతో పలువురికి నూతన జీవితం
గుంటూరు మెడికల్: బ్రెయిన్ డెడ్ అయి లోకాన్ని విడిచిపోతున్న వారి అవయవాల దానంతో పలువురికి నూతన జీవితాన్ని ప్రసాదించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని జీవన్ దాన్ సంస్థ మంగళవారం బ్రెయిన్‌డెడ్ అయిన ఇద్దరి అవయవాలను అవసరమైన వారికి పంపింది. మంగళగిరిలోని ఎయిమ్స్‌లో ఇండ్లమూరి నాగేంద్రకుమార్ (21) బ్రెయిన్ డెడ్ అయ్యారు. నాగేంద్రకుమార్ లివర్‌ను గుంటూరులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్‌కు మంగళవారం ప్రత్యేక గ్రీన్ చానల్ ద్వారా పోలీసుల సహకారంతో వైద్యులు తరలించారు. అలాగే, గన్నవరం పిన్నమనేని సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన మువ్వా ప్రదీప్‌కుమార్ (46)కు చెందిన రెండు కిడ్నీలను కూడా ఇదే హాస్పిటల్స్‌కు పంపారు. ఈ సందర్భంగా హాస్పిటల్స్‌కు చెందిన డాక్టర్ కార్తీక్ చౌదరి మాట్లాడుతూ.. పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా బ్రెయిన్ డెడ్ అయిన తమ వారి అవయవాలను కుటుంబసభ్యులు దానం చేయడం ఎంతో అభినందనీయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేల మంది వివిధ అనారోగ్యాలతో బాధపడుతూ అవయవాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. డాక్టర్ అనుష మాట్లాడుతూ ఒకరికి అవయవదానం చేసి జీవితాన్ని ప్రసాదించడం వల్ల వారి కుటుంబం మొత్తం ఆనందంగా ఉంటుందన్నారు.
ప్రదీప్‌కుమార్
నాగేంద్రకుమార్

అవయవ దానంతో పలువురికి నూతన జీవితం

అవయవ దానంతో పలువురికి నూతన జీవితం