
ముగిసిన రాజ్ భాషా వేడుకలు
లక్ష్మీపురం: గుంటూరు డివిజన్ పరిధిలో ఈనెల 14 నుంచి 29 వరకు నిర్వహించిన రాజ్ భాషా పక్షం–2025 వేడుకలు సోమవారంతో ముగిశాయి. గుంటూరు పట్టాభిపురంలోని డివిజన్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో డీఆర్‌ఎం సుధేష్ట సేన్ మాట్లాడారు. వేడుకల్లో భాగంగా హిందీ వర్క్‌షాప్‌లు, హిందీలో సాంకేతిక సెమినార్లు, డిపార్ట్‌మెంటల్ సమావేశాలు, హిందీ కీబోర్డ్ శిక్షణ, హిందీ పోటీలు, వ్యాసం, వక్తృత్వం, టైపింగ్, క్విజ్, జ్ఞాపకశక్తి, హిందీ పదజాలం తదితర కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. హిందీని అధికారిక భాషగా ప్రచారం చేయడం మన బాధ్యతని చెప్పారు. డీజీఎం శ్యామ సుందర్ సాహు మాట్లాడుతూ రాజ్ భాష అమలు కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం వివిధ పోటీల్లో బహుమతులు గెలుచుకున్న ఉద్యోగులకు అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం ఎస్. రమేష్ కుమార్, బ్రాంచ్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.