
అథ్లెట్స్ రోషన్, రమేష్‌లకు ఉత్తమ క్రీడాకారుల అవార్డుల
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఇటీవల ఏలూరు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో జరిగిన ఏపీ స్టేట్ జూనియర్ అథ్లెటిక్ చాంపియన్ షిప్ పోటీల్లో గుంటూరుకి చెందిన ఎస్‌కే రోషన్, బి. గణ రమేష్‌లకు ఉత్తమ క్రీడాకారుల అవార్డులను ప్రదానం చేశారని అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్.కె రోషన్ అండర్ –20 యువకుల విభాగంలో 110 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్‌ను 13.8 సెకండ్లలో పూర్తి చేసి బంగారు పతకాన్ని సాధించినట్లు తెలిపారు. అండర్ 14 బాలుర ట్రయాథ్లిన్ విభాగంలో బి.గణ రమేష్ బంగారు పతకాలు సాధించి ఉత్తమ క్రీడాకారుల ట్రోఫీలను అందుకున్నట్లు తెలియజేశారు. వీరిద్దరూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అంతర్జాతీయ క్రీడాకారుడు, శిక్షకుడు కృష్ణమోహన్, కె.రవి వద్ద శిక్షణ పొందినట్లు ఆయన పేర్కొన్నారు.