
సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి
నగరంపాలెం: పొలంలో కొంతమేర అక్రమించారని అధ్యాపకుడు, అద్దెల్లు చెల్లించకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నారని మరొకరూ వాపోయారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదులు– పరిష్కారాల వ్యవస్థ (పీజీఆర్‌ఎస్)లో పలువురు బాధితులు ఫిర్యాదులు చేశారు. అర్జీలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వీకరించారు. బాధితుల మొరను అలకించారు. చట్ట పరిధిలో సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. జిల్లాలోని పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఫిర్యాదులకు పరిష్కరించేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఎప్పటికప్పుడు అర్జీలు పరిష్కరించేలా దిశా నిర్దేశం చేస్తామని చెప్పారు. జిల్లా ఏఎస్పీలు రమణమూర్తి (పరిపాలన), కె.సుప్రజ (క్రైం), డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), అరవింద్ (గుంటూరు పశ్చిమ) కూడా అర్జీలు స్వీకరించారు.