
ఆరుగురికి ఏఎస్‌ఐలుగా ఉద్యోగోన్నతి
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): ఉద్యోగోన్నతి పొందడమనేది ప్రతి ఉద్యోగికి ఒక గౌరవమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. ఏఎస్‌ఐలుగా ఉద్యోగోన్నతి పొందిన ఎం.వరకుమార్, సీహెచ్ పుల్లారావు, ఎ.సాంబశివరావు, ఆర్.రవి, ఎం.సత్యనారాయణ, షేక్ షంషుద్దీన్‌లు ఆదివారం నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో సమర్ధవంతంగా విధులు నిర్వహించి, జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని అన్నారు.