
మహాలక్ష్మీ నమస్తుతే !
దేవీ శరన్నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు శుక్రవారం అమ్మవారు పలు ఆలయాల్లో ధనలక్ష్మిగా దర్శనమిచ్చింది. చేబ్రోలు ముట్లూరు రోడ్డులోని మార్కెట్టు సెంటర్‌లో రూ.25లక్షల కరెన్సీ నోట్లతో అమ్మవారిని భక్త బృందం ప్రత్యేకంగా అలంకరించింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహాలక్ష్మీ దేవిగా భక్తులను అనుగ్రహించారు. గుంటూరు రూరల్ మండలంలోని నల్లపాడు, చల్లావారిపాలెం గ్రామాల ప్రజల ఇలవేల్పు అయిన ఘంటాలమ్మ తల్లి, పుట్టలమ్మ తల్లి ఆలయంలో అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారు. పెదనందిపాడులోని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కనకదుర్గమ్మ అమ్మవారు ‘ధన కనకదుర’్గగా భక్తులకు దర్శనమిచ్చింది. ప్రత్యేక మండపంలో కొలువుదీరిన అమ్మవారిని రూ. 99,99,999తో మహాలక్ష్మిగా అలంకరించారు. – పెదకాకాని/చేబ్రోలు/ గుంటూరు రూరల్/ ప్రత్తిపాడు
పెదనందిపాడులో ‘ధన’ కనకదుర్గగా..